• మంచిర్యాల జిల్లాలో విషాదం.
• విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి.
• మృతి చెందిన వ్యక్తి గూగులోత్ శ్రీనివాస్ గా గుర్తింపు.
• నేన్నెల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వాసి.
నేన్నెల మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీనివాస్ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానిక నేన్నెల మండల ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ పొట్యాల గ్రామ శివారులో కౌలుకు తీసుకున్న పంటపొలానికి రక్షణగా సోలార్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. పొలంలోని కరెంట్ మోటార్ వైర్ తెగి సోలార్ కంచెపై పడింది. ఇది గమనించని శ్రీనివాస్ పొలంలో ఎరువులు చల్లుతుండగా సోలార్ కంచెకు తగిలాడు. ఆ కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో శ్రీనివాస్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఆమె సోలార్ కంచెను చూడగా దానిపై విద్యుత్ వైర్ కనిపించింది. సమీపంలోని పశువుల కాపర్లను పిలిచి మోటరు కు ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొగించారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సె ప్రసాద్ తెలిపారు. శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
