DBN TELUGU CHANNEL:- భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉదయం 9:30 నిమిషాలకు సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు.
ఉదయం 11 గంటల నుంచి సత్య సాయి శత జయంతి కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని ప్రధాని మోదీ నివాళర్పించనున్నారు. రూ. 100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
