• శామీర్ పేట ORR పై అగ్ని ప్రమాదం.
• రన్నింగ్ కారులో ఒకేసారిగా చెలరేగిన మంటలు.
• సజీవ దహనమైన డ్రైవర్.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ శామీర్ పేట ORR పై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రన్నింగ్ కారులోనే ఒకేసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ కూడా కారులో నుంచి బయటికి రాలేకపోవడంతో కారుతో పాటు డ్రైవర్ కూడా సజీవ దానం అయ్యారు. యొక్క ప్రమాదంలో డ్రైవర్ అస్తిపంజరం మాత్రమే మిగిలింది. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం తెలుసుకుంటున్నారు.
