DBN TELUGU CHANNEL:- నక్సల్స్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మాడావి హిడ్మా (43) హతమయ్యాడు. అతని భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం.. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం...
ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాప్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎజురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
