DBN TELUGU CHANNEL:- తెలంగాణ రాష్ట్రంలో అందెశ్రీ కన్నుమూయడంతో విషాదకర ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
మనం ఆయన ప్రస్తావనం చూసుకుంటే డా. అందెశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. అందెశ్రీకి ముగ్గరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. 'మాయమైపోతున్నడమ్మా' గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు.
