• ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు.
• కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
• బిఆర్ఎస్ అభ్యర్థి మాంగటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్.
• బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్.
• జూబ్లీహిల్స్ లో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం.
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ లో ఎన్నికల సందర్భంగా... జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్జన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
