DBN TELUGU CHANNEL:- తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్య సమస్యలతో హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని విషయం తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు ప్రేమ్ సాగర్ రావు భార్య సురేఖ కూడా ఉన్నారు.
