DBN TELUGU CHANNEL:-
• నీళ్ల సమస్యతో రోడ్డెక్కిన మహిళలు.
• సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కాళీ బిందెలతో నిరసన.
• కాసిపేట 1 గని ముందు నిరసన.
• బిజెపి మండల అధ్యక్షుడు సూరం సంపత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం ముత్యం పెళ్లి, చిన్న ధర్మారం గ్రామాలలో నేటి సమస్యను పరిష్కరించాలంటూ గురువారం ఉదయం బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాసిపేట1 గని ముందు మహిళలు, గ్రామస్తులు యువకులతో కలసి ఖాళీ బిందెలతో గేటు ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా... కాసిపేట మండల బిజెపి అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా గ్రామపంచాయతీలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్న నేటి సమస్య తీరడం లేదు. గ్రామపంచాయతీలో నిధులు కొరత కాంగ్రెస్ ప్రభుత్వం అద్వాన పరిస్థితిలో ఉంది. గ్రామాల్లో ఉన్న నాయకులు కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. అలాగే కాసిపేట, ముత్యం పెళ్లి, చిన్న ధర్మారం గ్రామాల్లో భూగర్భ జలాల్లో నీరు లేకపోవడం వల్ల బోరు పడని పరిస్థితి ఉందని సింగరేణి ఇస్తున్న నీరు ఫిల్టర్ చేయకపోవడం వలన ప్రజలు చర్మ వ్యాధులు ఆరోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలని సింగరేణి అధికారీ అదనపు మేనేజర్ నిఖిల్ అయ్యార్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి మూడు రోజుల్లో సమస్యను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు భాకి కిరణ్, నగరారపు ప్రసన్న, మహిళలు పోసు, లచ్చక్క, కవిత , పద్మ మహేశ్వరి, లక్ష్మి, గ్రామ యువకులు మహేష్, శ్రీకాంత్, హనుమంతు, అరవింద్ , గ్రామస్తులు బర్ల రామ్మూర్తి, సూరం కిషన్, నారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

