DBN TELUGU CHANNEL:-
- కార్మికులు, ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ.
- విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న యూనియన్ అధ్యక్షుడు.
- ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తాను.
- కొక్కిరాల సత్య పాల్ రావు.
:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ (అదానీ) సిమెంట్ కంపెనీ 29-08-2025 రోజున జరిగిన ఎన్నికల్లో యూనియన్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన కొక్కిరాల సత్య పాల్ రావు. ఈ సందర్భంగా... ముందుగా ఆదీవాసీ ముద్దు బిడ్డ కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్మికులు మరియు ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఓరియంట్ (అదానీ) సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్షులు కొక్కిరాల సత్య పాల్ రావు. ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కొక్కిరాల సత్య పాల్ రావుని మొదటన ఆడపడుచులు అందరూ కలిసి వీర తిలకం దిద్ది, పూలమాలలు వేసి, హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పకుండా అమలు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, నాయకులు కొక్కిరాల సత్య పాల్ రావును శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆదీవాసీలు డప్పు చప్పట్లతో నృత్యం చేస్తూ, కార్మికులు, ఆడపడుచులు సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ కార్మికులు మరియు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.



