DBN TELUGU CHANNEL:-
- సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.
- హాజరైన రాజకీయ రంగ ప్రముఖులు.
- అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు.
:- బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు.
-- ప్రతీ నవరాత్రుల్లో మహా అన్నదానం --
- ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ, తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నవరాత్రి ఉత్సవాలలో ఒకరోజు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ సేవకులు, సాయి భక్తులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్- రాజేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బిఆర్ఎస్ నాయకులు, కాంపెల్లి కవిత రాజం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రొడ్డ శారద, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు రామగిరి మహేష్ , గద్దల కుమార్ , కడపక శంకర్ , సిరికొండ మహేందర్ మాల సంఘం రాష్ట్ర నాయకులు కుంభాల రాజేష్, ఇతర పట్టణ ప్రముఖ నాయకులు , దక్షిణ మధ్య రైల్వే బెల్లంపల్లి రైల్వే ఏ ఎస్సై మోహన్ రాథోడ్, టూ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, రైల్వే అధికారులు, సిబ్బంది, బీసీ సంఘం నాయకులు కొదిరిపాక సత్యనారాయణ సేవకులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు. ట్రస్ట్ వారు దాతలకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్స్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.

