Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: కేయూ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు

DBN TELUGU CHANNEL:- 


• కేయూ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు ఈనెల 27 వరకు పెంపు.


• విద్యార్థులు ఆన్లైన్లో చెల్లించి కళాశాలలో దరఖాస్తు అందజేయగలరు.


• బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్.





- కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు తొలుత ఈనెల 23 వరకు ఉండగా ఆ గడువు ముగియడంతో మరో నాలుగు రోజులు పెంచి ఈనెల 27 వరకు ఫీజు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు వివరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ విద్యార్థిని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పరీక్ష ఫీజును ఆన్లైన్లో మీ సేవ సెంటర్ ద్వారా చెల్లించి ఆ రిసిప్టులకు కళాశాలలో ఇచ్చే దరఖాస్తును నింపి జత చేసి కార్యాలయ విభాగంలో అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించవచ్చని పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ సూచించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.