DBN TELUGU CHANNEL:-
• మంచిర్యాల జిల్లా TRP ప్రధాన కార్యదర్శిగా రాంటెంకి శ్రీనివాస్.
• నాపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకుగాను... నమ్మకంతో పని చేస్తా.
• ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్నకు, రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్.
- బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల మండలం మారుమూల ప్రాంతమైన కోణంపేటకు చెందిన రాంటెంకి శ్రీనివాస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నిక అయినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశం లో శ్రీనివాస్ రాంటెంకి పేరును ఉమ్మడి జిల్లా ఇంచార్జి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ అధిష్టానానికి పంపగా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలిపి మొదటి విడతలో ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. తనను నమ్మి పదవి ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్పీ పార్టీ బలోపేతానికి కృషి చేసి బాహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతానని తెలిపారు.
