DBN TELUGU CHANNEL:-
- అగ్నివీర్'కు ఎంపికైన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి.
- ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించిన మార్త సాయికుమార్.
- అభినందించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్.
- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మార్త సాయికుమార్ భారత సైన్యంలో చేరికకు సంబంధించి 'అగ్నివీర్' పోటీలో పాల్గొని ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. 2025 జనవరి బ్యాచ్ లో జరిగిన ఎంపికలో ఈ విద్యార్థి పాల్గొని ప్రతిభ కనబరిచారు. దీంతో విద్యార్థి సాయికుమార్ ను ఇండియన్ నేవీకి ఎంపిక చేస్తూ 'మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియా' వారు కాల్ లెటర్ పంపించారు. ఈ మేరకు విద్యార్థి మార్త సాయికుమార్ ఈనెల 14వ తేదీన ఇండియన్ నేవీలో 'టెక్నికల్ ఆర్గనైజేషన్ ఆఫీసర్'గా విధుల్లో చేరారు. ఈ ఉద్యోగ ప్రయత్నంలో తనకు సహకరించిన తల్లిదండ్రులకు, కాలేజీ మెంటార్ రామరాజు సార్ కు, ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ గార్లకు విద్యార్థి సాయికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థి సాయికుమార్ ను కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.