Type Here to Get Search Results !

ఫలించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీల కృషి.

DBN TELUGU CHANNAL:-


- కేంద్ర మంత్రులను కలిసి సమస్యను వివరించి 24గం.ల్లోపే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే, ఎంపీ.





- 10 రోజుల విరామం అనంతరం, పత్తి కొనుగోలు ఈరోజు మళ్లీ ప్రారంభమైంది, ఇది రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులకు గిట్టుబాటు ధరతొ కొంట్టున్న సీసీఐ.


- గత 10 రోజులుగా పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆధార్ ఆధారిత ధృవీకరణలో సాంకేతిక సమస్యల కారణంగా సీసీఐ పత్తి కొనుగోలు నిలిచిపోయింది. దీని వలన వేలాది క్వింటాళ్ల పత్తి అమ్మకానికి నోచుకోలేదు, రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


- ఈ విషయాన్ని డా. వివేక్ వెంకటస్వామి మరియు ఎంపీ వంశీ అత్యంత కీలకమైన పాత్ర తీసుకుని కేంద్ర అధికారులతో చర్చలు జరిపి సీసీఐ మరియు వస్త్ర మంత్రిత్వ శాఖతో ప్రత్యేక చర్చలు నిర్వహించి తక్షణమే పత్తి కొనుగోలు చేసేలా వారితో మాట్లాడారు 


- పత్తి రైతులు ఎమ్మేల్యే, ఎంపీల కృషిని కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.