DBN TELUGU CHANNEL:-
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం.
- 18 ఏళ్లు నిండిన విద్యార్థులంతా ఓటు వేయాలి.
- ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ .
- కళాశాలలో కార్యక్రమం నిర్వహణ.. ఓటు ప్రతిజ్ఞ.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఓటు విలువ గురించి వివరించినట్లు పేర్కొన్నారు. 18 సంవత్సరాల నిండిన విద్యార్థులంతా తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయడం అనేది భారతీయ పౌరులమైన మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. మంచి సమాజాన్ని నిర్మించాలంటే మంచి నాయకులకు ప్రజాప్రతినిధులుగా పట్టం కట్టాలని అన్నారు. ఇది జరగాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటు వేస్తామంటూ ఓటరుగా నమోదు చేసుకుంటామంటూ ఓటు తప్పకుండా వేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ తీశారు. కొత్త విద్యార్థులు ఓటరు నమోదు కోసం తమను సంప్రదిస్తే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కార్యాలయ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.