Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా సాయి భోజన్.

DBN TELUGU:- 


- అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా సాయి భోజన్.


- బెల్లంపల్లి పట్టణంలో పలుచోట్ల అన్నదానం పంపిణీ.


- బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ. 






-- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆర్థిక సహకారంతో సాయి భోజన్ అన్నదానం పంచినట్లు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, పేదవారికి, అన్నార్తులకు అన్నదానం పంచినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో సాయి భోజన్ పంచినందుకు ఆనందంగా ఉందని అన్నా కిరు. భావి భారత అభివృద్ధికి అంబేద్కర్ వేసిన బాటలు నేటికీ భారతావానికి అద్భుతమైన ఫలాలను అందిస్తున్నాయని కొనియాడారు. ఆయన బాటలో అందరూ నడవాలని ఆకాంక్షించారు.




--- అన్నదానం చేద్దాం ---


బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని బాయజమా సాయి సేవ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం సేవే మార్గంగా ట్రస్ట్ కొనసాగుతుందని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్ర విద్య త్రయాక్షర్ సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు తమ్మిడి అనిల్, పిడుగు శ్రీనివాస్, బుర్ర లక్ష్మణ్, కొమ్మెర సదానందం, మీర్జా అమిత్, అల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్నదానం చేయాలనుకునేవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లలో ట్రస్ట్ మేనేజర్- 8106550532, ట్రస్ట్ ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించగలరని కోరారు.






Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.