DBN TELUGU CHANNEL:-
- చివరి విడత పీజీ సీట్ల కోసం నవంబర్ 1 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
- ఆన్లైన్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనంతరం సీట్ల కేటాయింపు.
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎం.కామ్.
- ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, పీజీ ఇన్చార్జి మేడ తిరుపతి.
-- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ యూనివర్సిటీ పీజీ రెగ్యులర్ కోర్సులలో అడ్మిషన్ కోసం చివరి విడతలో భాగంగా నవంబర్ 1వ తేదీ లోగా ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిపిగెట్-2024 ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, పీజీ ఇన్చార్జి మేడ తిరుపతి తెలిపారు. ఇక్కడ ఎంఏ పొలిటికల్ సైన్స్ తో పాటు ఎంఏ ఇంగ్లీష్, ఎం.కామ్ కోర్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను సిపి గెట్ పిజి ఎంట్రన్స్ పరీక్షను రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
- వారు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు -
-- మొదటి, రెండవ విడతల పీజీ అడ్మిషన్లలో ఇతర పీజీ కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం చివరి విడతలో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ చెప్పారు. ఇందుకు గాను నవంబర్ 1 లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని, నవంబర్ 1 నుంచి 4వ తేదీలోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని సూచించారు. నవంబర్ 8న చివరి విడత పీజీ సీట్ల కేటాయింపు ఉంటుందని, సీట్లు పొందిన వారు 12వ తేదీలోపు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్లలో 9959269975, 9948075400, 9959539369, 7780418194 సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ సూచించారు.