DBN TELUGU NEWS CHANNEL:-
- బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ప్రజా జ్యోతి విలేఖరి అరెస్టు.
నిదితుడి వివరాలు:-
-- కనుకుంట్ల వెంకట్రాజ్ S/O ఎల్లయ్య, వ:30 సం:లు, వృతి: విలేఖరి, R/o చెన్నూర్.
స్వాధీనం చేసుకున్న ఆస్తులు:-
1) సెల్ ఫోన్స్- 1
కేసు యొక్క సంక్షిప్త వాస్తవాలు.
చెన్నూర్ కి చెందిన కనుకుంట్ల వెంకట్రాజ్ S/O ఎల్లయ్య అను అతను ప్రజా జ్యోతి విలేఖరిగా పనిచేస్తున్నాడు విలేఖరి ముసుగులో అమాయక ప్రజలను బెదిరింపులు గురి చేసి డబ్బులు వసూలు చేశాడు. తేదీ: 16-06-2024 రోజున చెన్నూర్ NGO’s కాలనీకి చెందిన గంగిరెడ్డి రాజేశo s/o రామయ్య, R/o గోదావరిఖని అను అతనికి చెందిన ఇంటిని సుందర్ అను అతనికి 2 సం:లు కిందట ఇల్లు కిరాయికి ఇవ్వగా అతను అద్దె సరిగా చెల్లించక పోయే సరికి తేదీ: 17-06-2024 రోజున అడగగ, ఇట్టి విషయం తెలిసిన వెంకట్రాజ్ రాజేశo కు ఫోన్ చేసి నేను ప్రజా జ్యోతి న్యూస్ పేపర్ విలేఖరి అని సుందర్ అను అతనితో నువ్వు గొడవ పడ్డావు కాబట్టి నీపై SC/ST అట్రసిటి కేస్ పెడతామని, అలాగే ప్రజా జ్యోతి న్యూస్ పేపర్ లో నీపై వార్తలు రాసి నీ పరువు తీస్తానని చెప్పి బెదిరించినాడు. అదే విదంగా రాజేశo అస్నాద్ x రోడ్ వద్ద ఉండగా వెంకట్రాజ్ అతని వద్దకు వెళ్ళి రూ:50,000/- డిమాండ్ చేయగా అతను అప్పటికప్పుడు ఫోన్ పే ద్వారా రాజేశo సెల్ ఫోన్ నుండి వెంకట్రాజ్ సెల్ ఫోన్ కు రూ:5,000/- పంపిచినాడు, కానీ వెంకట్రాజ్ అతడిని ఇంకా డబ్బులు కావాలని నిత్యం వేదించడం తో తేదీ: 22-09-2024 రోజున గంగిరెడ్డి రాజేశo ఫిర్యాదు మేరకు వెంకట్రాజ్ పై Cr.No.174/2024, u/s. 384 IPC కింద కేస్ నమోదు చేయ నైనది. వెంకట్రాజ్ గతంలో ఇదే విదంగా ప్రజా జ్యోతి న్యూస్ పేపర్ విలేఖరి అని చెప్పి బొమ్మ శ్రీనివాస్ రెడ్డి అను అతడు తన భూమిలో మొరo తవ్వుతూండగా అతడిని అక్రమంగా మొరo తవ్వుతున్నవని బెదిరింపులకు పాల్పడి విడ్డతల వారీగా రూ:25,500/- వసూలు చేసినాడు దాంతో అతనిపై Cr.No.153/2024, u/s. 384 IPC కింద కేస్ నమోదు చేయడం జరిగింది. అలాగే నాయిని తిరుపతి పండ్ల వ్యాపారస్తుడు వద్ద రూ:50,000/- డిమాండ్ చేసి అక్రమ కట్టడం నిర్మిస్తున్నవని బెదిరింపులకు పాల్పడి రూ:31,000/- వసూలు చేసినాడు, దాంతో అతనిపై Cr.No.155/2024, u/s. 384 r/w 34 IPC కింద కేస్ నమోదు చేయడం జరిగింది. అలాగే గుర్రం సుధాకర్ అను వ్యక్తి చికెన్ సెంటర్ నిర్మాణం చేపడుతుండగా అక్రమ నిర్మాణం చేపడుతున్నవాని బెదిరింపులకు పాల్పడి రూ:5,000/- వసూలు చేసినాడు. దాంతో అతనిపై Cr.No.156/2024, u/s. 384 IPC కింద కేస్ నమోదు చేయడం జరిగింది. దాంతో ఇట్టి నేరస్థున్ని ఈ రోజు అరెస్టు చేసి అతని వద్ద నేరాలకు ఉపయోగించిన సెల్ ఫోన్ ను సీజ్ చేసి రిమండ్ కు పంపనైనది .
నేరస్థుడు పాల్పడిన కేస్ ల వివరాలు Cr.No.155/2024, u/s. 384 IPC
1) Cr.No.153/2024, u/s. 384 IPC,
2) Cr.No.155/2024, u/s. 384 r/w 34 IPC
3) Cr.No.156/2024, u/s. 384 IPC
4) Cr.No.174/2024, u/s. 384 IPC
ఇట్లు
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు
చెన్నూర్ పోలీసు స్టేషన్.