DBN TELUGU NEWS CHANNAL:- కాసిపేట మండలంలోని సమస్యలపై మండల ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ కి సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తున్న బిజెపి మండల అధ్యక్షుడు సంపత్ కుమార్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొండాపూర్ యాప నుండి సోనాపూర్ వైపు వెళ్లే రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని వినతి పత్రం అందించడం జరిగింది. అలాగే చిన్న ధర్మారం గ్రామంలో తాగునీటి సమస్య మరియు చిన్న ధర్మారం వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జ్ మరమ్మలు నిర్వహించే సైడ్ వాల్ నిర్వహించాలి. అలాగే రొట్టె పెళ్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు, తాగునీటి సమస్య పెద్ద ఎత్తున ఉంది. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో ఎంపీడీవోతో సూరం సంపత్ కుమార్ మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు పెద్దపల్లి శంకర్ పాల్గొన్నారు.