DBN TELUGU CHANNAL:-
- డిగ్రీలో ప్రవేశానికి నేడే ఆఖరి రోజు.
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ డ్రైవ్ ఫేజ్.
- అందుబాటులో బీకాం టాక్సేషన్, బీకాం కంప్యూటర్స్, బిఏ, బీఎస్సీ కోర్సులు.
- ఈ విద్యా సంవత్సరానికి దాదాపు ఇదే చివరి అవకాశం.
- ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్లకు ఈనెల 9 సోమవారమే ఆఖరి రోజు అని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దోస్త్ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాలలో బీకాం టాక్సేషన్, బీకాం కంప్యూటర్స్, బీఏ, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ బీజెడ్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే నాలుగు ఫేజ్ ల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవగా... ఇప్పుడు జరుగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్లు దాదాపుగా చివరి అవకాశం అని, అది కూడా సోమవారమే ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తుకు దాదాపు చిట్టచివరి అవకాశం అని పేర్కొన్నారు. కళాశాలలో మిగిలి ఉన్న డిగ్రీ సీట్లకు గాను ఈ ప్రత్యేక విడత ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్ 9948075400 లో గాని, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాని సంప్రదించవచ్చని తెలిపారు.