DBN TELUGU CHANNEL:- హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నం... 2లో శనివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అయితే ఒక్కసారిగా కారు వేగం పెంచడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
కారు పల్టీ కొడుతూ లుంబినీ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్లో ఉన్న ఆటో, ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మైనర్ బాలుడు కారు నడిపినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.