DBN TELUGU CHANNEL:- నెన్నెల మండలం కొనంపేట గ్రామంలోని గిరిజన వాడకు చెందిన పంగిడి భీమయ్య (50) అనారోగ్యంతో మృతి చెందారు.
నిరుపేద కుటుంబం కావడంతో దశ దిన కర్మ కార్యక్రమం లో భాగంగా హెల్పింగ్ హాండ్స్ ఫర్ కోణంపేట సభ్యులు ఆధ్వర్యంలో 3020 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సంస్థ ద్వారా కోణంపేట గ్రామానికి చెందిన నిరు పేదలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం మరియు తోచిన ఆర్థిక సహాయం చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు సోనీ ఫైజోద్దిన్, అంజయ్య, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, సభ్యులు పరశురామ్, శంకర్ తదతరులు పాల్గొన్నారు.