DBN TELUGU CHANNEL:- ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని బాలేపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి దేవాజీ కుమారుడు దీపక్ ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇరిగేషన్ AEEగా ఎంపికయ్యారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి... కష్టపడి చదువుకొని ఎలాగైనా ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఉన్న ఆలోచనతో... పరీక్ష రాసిన మొదటి అటెంప్ట్ లోనే ప్రభుత్వ ఉద్యోగంలో ఎంపికయ్యాడు. అతడు పదో తరగతి వరకు సిర్పూర్ గురుకుల పాఠశాల, అనంతరం డిప్లమా, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు.