Type Here to Get Search Results !

కాసిపేట 2 గని లో బొగ్గు గనుల వేలం పై వ్యతిరేకంగా నల్లాబ్యాడ్జిల నిరసన...!

DBN TELUGU:- 


- కాసిపేట 2 గని లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బొగ్గు గనుల వేలం పై టిబిజికెయస్ ఫీట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో నల్లాబ్యాడ్జిల నిరసన.


- గని మేనేజర్ లక్ష్మీనారాయణ కీ మెమొరాండం అందజేత.





కాసిపేట: బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ,టిబిజికెయస్ యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ ఆదేశానుసారం ఈ రోజు కాసిపేట 2 గని లో టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి ఆధ్వర్యంలో నల్లాబ్యాడ్జిల నిరసన తెలుపడం జరిగింది. అనంతరం కారుకురి తిరుపతి మాట్లాడుతూ... కేంద్రం అనుసరిస్తున్న బోగ్గు గనుల వేలన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అధికారం లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ కే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరడం జరుగుతుంది. 10 సంవత్సరాలు ఒక్క బోగ్గు బ్లాకు కూడా వేలం వేయకుండా కెసీఆర్ మన కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు కనీసం అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. బొగ్గు గనులను వేలం వేసే నిర్ణయాన్ని ఇకనైనా వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరో తెలంగాణ ఉద్యమం చూడడం ఖాయం ఆనాడు సకల జనుల సమ్మె లో పెద్ద ఎత్తున కార్మికుల సోదరులు అందరు పాల్గోని ఎక్కడికక్కడ బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. శ్రావణ్ పల్లి నీ ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర లు చేస్తున్నాయి.అదే జరిగితే ఎక్కడికక్కడ జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు సమ్మె తప్పదనీ కార్మికుల కోసం చేస్తున్న ఈ పోరాటానికి అన్ని యూనియన్ సంఘలు కూడా మద్దతు తెలుపాలని కార్మికులు కోసం ఎలాంటి ఉద్యమం చేయడానికైనా టిబిజికెయస్ సిద్ధం అని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోగ్గు బ్లాకులను వేలం వేయకుండా టిబిజికెయస్ యూనియన్ కోరగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిని అడ్డుకుందాని ఈ రోజు అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు తెలిపిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా గెలిచి ఉంది కాబట్టి ఎలాగైనా ఈ బోగ్గు గనుల వేలం ప్రక్రియ ను రాష్ట్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీ పై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు అండగా ఉండాలని అవసరం ఎంతో ఉంది అని ఆయన తెలుపడం జరిగింది. అనంతరం గని మేనేజర్ లక్ష్మీనారాయణ కీ టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి మోమరండం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసిపేట 2 గని టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, సారంగపాణి, సీనియర్ నాయకులు రాజన్న కదురి రాజయ్య, యువ నాయకులు సింగతి క్రృష్ణ, ఆసనపల్లి వెంకటేష్, సత్తిష్, రాజుకుమార్, వెంకటేష్, మహెందర్, పవన్, కుమార్, మహేష్, మనోజ్, సందీప్, శ్రావణ్, మహనమ, కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.