Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: బెల్లంపల్లి సిఓఈకి తిరుగులేదోయ్...!

DBN TELUGU:- 



- జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 4 మందికి జాతీయ స్థాయి ర్యాంకులు. 


- 1171 ర్యాంకుతో కళాశాల టాపర్ గా నిలిచిన ఆడె నవనీత్.

 

- అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్,ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి. 


- ప్రిన్సిపాల్ ను ఘనంగా సన్మానించిన పేరెంట్స్ కమిటీ.





పరీక్షలు ఏవైతేనేం ఫలితాల్లో ప్రభంజనమే అన్నట్లుగా బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులు విజయాలు సాదించి తమకు తిరుగులేదనిపిస్తున్నారు. ఆదివారం ఎన్టీఏ వెల్లడించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ) బెల్లంపల్లి జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులతో అబ్బురపరిచింది. కళాశాల నుండి హాజరైన 9 మంది విద్యార్ధుల్లో నలుగురు క్వాలిఫై కావడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. వీరిలో ఆడె నవనీత్ 1171 ర్యాంక్ తో కళాశాల టాపర్ గా నిలిచాడు. అదేవిధంగా దుర్గం చరణ్ తేజ్ (2778), వెలుతురు అఖిల్(3679), రాంటెంకి శివ(7476)లు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.   


అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్:- 


జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి బెల్లంపల్లి ప్రతిష్టను పెంచిన సిఓఈ విద్యార్ధులు అభినందనీయులని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఫలితాలు వెల్లడయిన సందర్భంగా ఫోన్ లో విద్యార్ధులను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక ప్రణాళికతో నాణ్యమైన విద్యను గ్రామీణ పేదింటి బిడ్డలకు అందించడానికి నిర్విరామంగా క్రుషిచేస్తున్న అధ్యాపకులను సమాజం గుర్తిస్తుందన్నారు. ఉత్తమ ఫలితాలతో ముందజలో ఉంటున్న సిఓఈ ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సిఓ కొప్పుల స్వరూపరాణి విద్యార్ధులను అభినందించారు.  క్వాలిఫై అయిన విద్యార్ధులకు జోసా కౌన్సిలింగ్ లో ర్యాంకుల ఆధారంగా పలు ఐఐటి ల్లో సీట్లు కెటాయింపు జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్ధులను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్,అధ్యాపకులు నాగిని శ్రీరామవర్మ, పిన్నింటి కిరణ్, చందా లక్ష్మీనారాయణ, మిట్టా రమేష్, కట్ల రవీంధర్,ముద్దసాని శోభ, అవునూరి రవి, అల్లూరి వామన్, తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులును బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మ కారుకూరి రాంచందర్, పేరెంట్స్ కమిటీ ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మారుమూల గ్రామాల్లోని పేద పిల్లలకు చదువు విలువ తెలిపి ఒత్తిడి లేకుండా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న బెల్లంపల్లి సిఓఈ రాష్ట్రంలోనే ఉత్తమంగా నిలిచిందన్నారు. నిస్వార్ధంతో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ సేవలు ఇతరులకు  ఆదర్శమన్నారు. అంకితభావంతో పనిచేస్తున్న అధ్యాపకుల కృషి ఎనలేనిదన్నారు. విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బెల్లంపల్లి సిఓఈ ఇక్కడి ప్రజలకు దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెస్తూ తమదైన ముద్ర వేసుకునేలా పిల్లలను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. గొప్ప ఫలితాలను సాధిస్తున్న బెల్లంపల్లి సిఓఈ ని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని సౌకర్యాలను కల్పించి అభివృద్దిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఓఈ పేరెంట్స్ కమిటీ గౌరవాద్యక్షులు దాగం తిరుపతి, అద్యక్ష కార్యదర్శులు పుదారి నగేష్ గౌడ్,దాగం మహేష్, నాయకులు ఇప్పరవి తదితరులు పాల్గొన్నారు.








Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.