DBN TELUGU:- అదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టూడెంట్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో రాంజీ గోండు 164 వర్ధంతి ని నిర్వహించారు. రాంజీ గొండ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... జల్ జంగల్ జమీన్ కోసం, ఆదివాసి హక్కుల కోసం పోరాటం చేసిన ఆదివాసి వీరుడు రాంజీ గోండు అని అన్నారు. ఆదివాసుల అభ్యున్నతికి రాంజీ గోండు చేసిన సేవలు ఎప్పుడు మర్చిపోలేనివి అని అన్నారు. రాంజీ గోండు ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ ఫోరమ్ అధ్యక్షులు బి రాహుల్, ఉపాధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి ఇఫ్తేకర్ ఉద్దీన్, సహాయ కార్యదర్శి సత్యనారాయణ, ఆర్టిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాకర్, జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.