DBN TELUGU:-
- సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం.
- ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా మూడు పరీక్ష కేంద్రాలు.
- పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
- బెల్లంపల్లి ఆసిఫాబాద్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి.
- పరీక్షా కేంద్రాల్లో చల్లటి నీరును అందజేసిన ఆయా చీఫ్ సూపరింటెండెంట్స్.
అదిలాబాద్ రీజియన్ లోని 3 పరీక్షా కేంద్రాల్లో 6వ తరగతికి 438 మందిఇంటర్మీడియట్ కు 405 మంది హాజరయ్యారు. రెండు తరగతులకు కలిపి 843 మందికి గాను 781 మంది పరీక్ష రాయగా 62 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. అలాగే 92. 65% విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సిఓ కొప్పుల స్వరూప రాణి తెలిపారు. బెల్లంపల్లిలో సి ఓ ఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులతో కలిసి సెట్ కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు.
>పరీక్ష కేంద్రాల వారీగా వివరాలు<
-- బెల్లంపల్లి సిఓఈ బాయ్స్.
6వ తరగతిలో 227 మంది కి గాను 215 మంది హాజరవగా 12 మంది గైర్హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ లో 231 మందికి గాను 216 మంది హాజరవగా 15 మంది గైర్హాజరయ్యారు.
-- ఆదిలాబాద్ సిఓఈ గర్ల్స్.
6వ తరగతిలో 116 మందికి గాను 108 మంది హాజరుకాగా 8 మంది గైరహాజరయ్యారు.
ఇంటర్మీడియట్ లో 114 మందికి గాను 110 మంది హాజరుకాగా,4 మంది గైర్హాజరయ్యారు.
-- ఆసిఫాబాద్ బాయ్స్.
6వ తరగతి- 95 మందికి గాను 84 మంది హాజరుకాగా 11 మంది గైర్హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ లో 60 మందికి గాను 48 మంది హాజరుకాగా 12 మంది గైర్హాజరయ్యారు. బెల్లంపల్లి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపర్డెంట్ గా అయినాల సైదులు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా వరమని ప్రమోద్ కుమార్ వ్యవహరించారు. రూట్ ఆఫీసర్ గా దశరథం ఉన్నారు.
ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా సంబంధిత సెంటర్లలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించారు. బెల్లంపల్లిలో ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.