Type Here to Get Search Results !

గురుకుల సైనిక్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపాల్.

DBN TELUGU:- 


- గురుకుల సైనిక్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపాల్.


- ఆదిలాబాద్ రీజియన్ లో 3 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు.


- ఆదిలాబాద్ సిఓఈ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి సిఓఈ లలో పరీక్షకు హాజరు కానున్న 852 మంది విద్యార్ధులు.


- ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.



తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ బెల్లంపల్లి లో సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్ధులు గంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్ధులు సంక్షేమ గురుకులాల వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హల్ టికెట్, ఫ్యాడు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింత్ పెన్ వెంట తీసుకొని రావాలన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని కుండల్లో చల్లని నీరు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 



                తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆద్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రుక్మాపూర్ లో నడుస్తున్న సైనిక్ స్కూల్ మరియు కళాశాలలో వచ్చేవిద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకోసం ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైనిక్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఆదిలాబాద్ రీజియన్ లో మంచిర్యాల జిల్లాకు సంబందించి బెల్లంపల్లి బాలుర సిఓఈ లోను ఆదిలాబాద్ జిల్లాకు సంబందించి ఆదిలాబాద్ సిఓఈ గర్ల్స్ లోను, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబందించి ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారని తెలిపారు.  

> పరీక్షా కేంద్రాల వారీగా విద్యార్ధుల వివరాలు.


> ఆదిలాబాద్ సిఓఈ గర్ల్స్  

6వ తరగతి-116 మంది

ఇంటర్మీడియట్ - 116 మంది


> ఆసిఫాబాద్ బాయ్స్ 

6వ తరగతి- 96 మంది

ఇంటర్మీడియట్ - 62 మంది


> బెల్లంపల్లి సిఓఈ బాయ్స్  

6వ తరగతి- 229 మంది

ఇంటర్మీడియట్ -233 మంది 


441మంది 6వ తరగతికి 411 ఇంటర్మీడియట్ కు మొత్తం 852 మంది పరీక్షకు హాజరవుతున్నారు.


ప్రవేశ పరీక్షకు సంబందించిన ఏర్పాట్లు,పరీక్షాకేంద్రాల్లో సౌకర్యాల కల్పన ను ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి పర్యవేక్షణలో జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ సైదులు తెలిపారు. ఇప్పటికే సంబందిత పరీక్షాకేంద్రాల దగ్గరగల పోలీస్ స్టేషన్స్ కు ప్రశ్నాపత్రాలు రూట్ ఆఫీసర్ దశరథం అందజేశారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.