DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మంథని, రామగిరి, పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రామగుండం సిపి. ఈ సందర్భంగా సిపి కి ఏసీపీ ఎం. రమేష్, మంథని సీఐ వెంకటేశ్వర్లు మొక్కను అందించి ఆహ్వానం పలికారు.
అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ప్రాజెక్ట్ లు, ముఖ్యమైన ప్రదేశాలు, గ్రామపంచాయతిలు, హమ్లెట్ గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా రామగుండం సి పి మాట్లాడుతూ... రామగుండం పోలీస్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ లను విసిట్ చేయడం జరిగిందన్నారు. మంథని, రామగిరి పోలీసులు నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని పిడి యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి నుండి ఎలాంటి చట్ట విరుద్ధమైన చర్యలు చేపట్టిన సహించేది లేదని ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. అలాగే అక్రమ దందాలు అరికట్టేందుకు స్థానిక పోలీస్, టాస్క్ ఫోర్క్ పని చేస్తున్నాయని, చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసే వారిపై కేసులు కూడా చేయడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమం లో గోదావరిఖని, ఏసీపీ ఎం. రమేష్, మంథని సీఐ వెంకటేశ్వర్లు, మంథని ఎస్ఐ వెంకట కృష్ణ, రామగిరి ఎస్ఐ సందీప్ లు ఉన్నారు.