DBN TELUGU:- మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి జోనల్ ఇన్చార్జి అనే అహంతో జీవోలను పాటించకుండా అతనికి ఇష్టం వచ్చినట్లు రోస్టర్ పాయింటింగ్ రాసుకొని జిల్లా కలెక్టర్ కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కోర్టులో పెండింగ్ ఉన్నటు వంటి ప్రమోషన్లు, పోస్టింగులు లను సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ(SCDD) మంచిర్యాల అధికారి ప్రమోషన్లు పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది.
ఈ విషయంపై ఇప్పటికి కలెక్టర్ దృష్టిలో ఉన్నప్పటికీ ఎందుకు అధికారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా విజిలెన్స్ విచారణ జరిపి అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలని PDSU విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలోనే దీనిపై రాష్ట్ర కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.