DBN TELUGU:- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఈరోజు మధ్యాహ్న సమయంలో వ్యవసాయ భూమి వద్ద కొమ్ముల తిరుపతిరెడ్డి కొమ్ముల శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్యన సాగు నీటి వివాదం చెలరేగడంతో తన సొంత తమ్ముడైన కొమ్మల శ్రీనివాస్ రెడ్డి (40) నీ పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని దాడి చేశాడు. మెడపై బలమైన గాయం కావడంతో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసి నిందితుడు పరారైనట్లు సమాచారం. మృతుడి శ్రీనివాస్ రెడ్డికి భార్య ఒక కూతురు కుమారుడు ఉన్నారు. ఒకే ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు సోదరులకు గత కొద్ది రోజుల నుండి వ్యవసాయ భూమి వద్ద తగాదాలున్నట్లు తెలిసింది. ఇద్దరి వ్యవసాయ భూమికి ఒకే సాగునీటి బావి ఉండటం మోటర్ సౌకర్యం ఒకటిగా ఉండటం వల్ల తరచూ వివాదం తలఎత్తుతుందని అలాగే గట్ల ప్రక్కన ఉన్న చెట్లను ఇటీవల తిరుపతి రెడ్డి అమ్ముకున్నాడని శ్రీనివాస్ రెడ్డి గొడవ చేయటంతో వివాదం ముదిరినట్లుతెలిసింది. దీంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఏసిపి వాసాల సతీష్, సీఐ కిరణ్ కుమార్, ఎస్సై తిరుపతిలో సందర్శించి వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.