వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లి అటవీ ప్రాంతంలోని కమ్మర్పల్లి పోషమ్మ ఆలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. పెద్ద నారేప చెట్టు పక్కన రెండు మీటర్ల వెడల్పుతో మీటర్లోతు వరకు గొయ్యి తవ్వారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలతో పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల మాట్లాడుతూ... గతంలోనూ తెలియని దుండగులు ఇక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లి అటవీ ప్రాంతంలోని కమ్మర్పల్లి పోషమ్మ ఆలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. పెద్ద నారేప చెట్టు పక్కన రెండు మీటర్ల వెడల్పుతో మీటర్లోతు వరకు గొయ్యి తవ్వారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలతో పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల మాట్లాడుతూ... గతంలోనూ తెలియని దుండగులు ఇక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు వెల్లడించారు.