DBN TELUGU:- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ఆర్ఎస్పీ, మరి కొద్ది మంది పార్టీ నేతలు సమావేశమయ్యారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మర్యాద పూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ రోజు ఉదయం “నా రాజకీయ ప్రస్థానం పై వస్తున్న వదంతులను నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఒంటరి అయిపోయిన బీఆర్ఎస్‌తో ఆర్ఎస్పీ భేటీ కావడం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది. మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా... వదంతుల్ని నమ్మకండి అంటూ ఆర్ఎస్పీ క్లారిటీ ఇచ్చినా ఈ భేటీ పైన రాజకీయ ఊహాగానాలు తలెత్తుతున్నాయి.