Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: గన్ ఫైరింగ్ కేసును చేదించిన పోలీసులు.

 DBN TELUGU:- 


- సాలిగాంలో గన్ ఫైరింగ్ కేసును చేదించిన పోలీసులు.


- నిందితుడిని రిమాండ్ కు తరలింపు.


- కేసును త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించిన ఉన్నతాధికారులు.

 


-- మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామం లో గొలేటి శంకర్ కుటుంబంను బెదిరించి గన్ తో ఫైర్ చేసిన నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకొని కేసును సేదించిన పోలీసులు. వివరాల్లోకి వెళితే... గొలేటి శంకర్ లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కలరు. వారిలో పెద్ద కుమార్తె అయిన బేబీ ని బెల్లంపల్లి మండలంలోని మాలగురిజాల కు చెందిన గోమాస నరేందర్ అనే వ్యక్తికి 2016 లో వివాహం జరిపించారు. అయితే వివాహం అయినప్పటి నుండి నరేందర్ తన భార్యని మరియు తన అత్త, మామలను ఆస్తి మరియు అదనపు కట్నం కోసం వేధించేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 27 న రాత్రి నరేందర్ తన దగ్గర ఉన్న పిస్టల్ తో సాలిగాం లోని తన మామ ఇంటికి వచ్చి తన అత్తా, మామలను చంపుతా అని బెదిరించుకుంటూ ఇంటి ముందు పిస్టల్ తో రెండు రౌండ్ల కాల్పులు జరిపి తిరిగి నరేందర్ తన స్నేహితుడు మహేష్ తో కలిసి తన ఇంటికి బయలుదేరారు. ఇట్టి సంఘటన పై గోలేటి శంకర్ తేదీ ఫిబ్రవరి 28 న ఇచ్చిన ఫిర్యాదు పై కన్నేపల్లి పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. వెంటనే మంచిర్యాల డీసీపీ ఉత్తర్వుల మేరకు, బెల్లంపల్లి ఏసిపి సారధ్యంలో ఒక టీమ్ నీ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంనీ వినియోగించి నేరస్థుడు ఐన గోమాస నరేందర్ ను పట్టుకొని విచారించగా అతను గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ లోని పేపర్ ప్లేట్ కంపనీ నందు పని చేసుకుంటూ కరీంనగర్ నగునూర్ లో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడని, అతనికి నెలకు 25,000 రూపాయల జీతం వస్తుందని, అతని భార్య బేబీ స్టాఫ్ నర్స్ గా ప్రతిమ హాస్పిటల్ లో పని చేసేదని, కూతురు పుట్టిన తరువాత అతని భార్య ఉద్యోగం మానివేయడంతో తన జల్సాలకు మనీ సరిపోక ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వగా అతని పెళ్ళిలో తన మామ తనకు 10,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోగా తను తన భార్యను మరియు అత్తా, మామలని వేధించేవాడని, సుమారు సంవత్సరం క్రితం రాత్రి సమయంలో అత్తా, మామలను చంపుతూ తను శాలిగాంకి వెళ్లగా అక్కడ అతన్ని ఊరి వాళ్ళు కలిసి అతన్ని కొట్టారని, ఇవన్నీ మనుసులో పెట్టుకొని ఎలాగైనా వారి అత్తా,మామ లను చంపాలని ఉద్దేశ్యం తో బీహార్లో తుపాకులు విరివిగా దొరుకుతాయని తెలుసుకొని, దాదాపు ఆరు నెలల క్రితం కరీంనగర్ లో అతని తో పాటు పని చేస్తున్న బీహార్ కి చెందిన రవిందర్ పెళ్లికి పోయినప్పుడు అక్కడ పిస్టల్ మరియు రౌండ్లనీ కొనుక్కొని తేదీ 26.02.2024 న కరీంనగర్ నుండి బయలుదేరి 27.02.2024 నాడు తన స్నేహితుడు ఐన కోడి మహేష్ ను మాలగురిజాల లో తన బైక్ ఎక్కించుకొని సాలిగాం కి వెళ్లి అక్కడ తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో తన అత్తా, మామ లని బెదిరించగా వారు ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకొనగా తన దగ్గర ఉన్న ఆయుధం తో రెండు రౌండ్లు కాల్చి వారు బయటకి రాకపోయేసరికి అక్కడ నుండి అతను కరీంనగర్ కి వెళ్ళాడు. పోలీస్ వారు అత్యంత చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని శుక్రవారం రోజున రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ లను ఉన్నతాధికారులు అభినందించినారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.