DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని... ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(21) ఉరి వేసుకుని చనిపోగా... విషయం తెలుసుకున్న ప్రియుడు నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామంలో భగవాన్(21) పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.
.jpeg)