DBN TELUGU:-
> నెహ్రూ యువ కేంద్ర
ఆధ్వర్యంలో నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్.> ఆకట్టుకున్న విద్యార్థుల చర్చలు.
> నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్ వినూత్నంగా నిర్వహించారు.
జిల్లాస్థాయి నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా సుశీల్ బర్డ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వo దృష్టికి తీసుకుపోయి సమస్యలపై చర్చించే విధానం అత్యంత పారదర్శకంగా జరగాలన్నారు. విద్యార్థులు పార్లమెంట్ సమావేశాల వివరాల విధానాన్ని తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. భారతదేశo అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పది కాలాలపాటు నిలబడడానికి పార్లమెంట్ లో జరిగే ఉత్తమ చర్చలే పునాది అన్నారు. పార్లమెంటు సభ్యులకు కావలసిన ప్రాథమిక జ్ఞానం, ప్రజా అవసరాలపై అవగాహన, సమస్యల పరిష్కారం కై కృషి చేయాలన్న తపన మరింత పెరగాలన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే పార్లమెంట్ సభ్యుల హుందాతనం పెరుగుతుందన్నారు.
పార్లమెంటు సమావేశాలలో జరిగే చర్చల ప్రతిబింబించేలా విద్యార్థులను తీర్చిదిద్ది వారిలో రాజకీయ చైతన్యంతో పాటు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన కలిగిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.నెహ్రూ యువ కేంద్రo చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం జరిగిన యూత్ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షం వాడివేడిగా చేసిన చర్చలు ఆకట్టుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుల ప్రతిపాదన ఆమోదం, విమర్శలు ప్రతి విమర్శలు హిందీ ఇంగ్లీష్ భాషలలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో పార్లమెంటు సభ్యులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను యధాతధంగా ప్రదర్శించి వహ్వా అనిపించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ సుషీల్ బడ్,సీనియర్ రిసోర్స్ పర్సన్స్ గజెళ్లి మోహన్, మేళ్ళచెర్వు జానకి, ముద్దసాని శోభ, చందా లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, భోగె శ్రీలత , వరమని ప్రమోద్ కుమార్, స్వాతి, అనుముల అనిరుద్, ఎన్.వై.కె. సిబ్బంది సాయి, సురేష్, మజీద్, కె.రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.