DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఇవాళ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రజా పాలన కౌంటర్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. అలాగే ఆరు గ్యారంటీల కోసం లబ్దిదారులు దరఖాస్తులు ప్రజా పాలన కేంద్రంలో చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. ప్రజలకు ఆరు గారంటీ పథకాలను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.