Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే మోరీలో వేసినట్టే.

DBN TELUGU:- పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం నాడు నారాయణ్‌ఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.



ఈ సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ ను ఓడించి గుణపాఠం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనని చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. తులం బంగారం, పింఛన్ పెంపు, మహిళలకు రూ. 2500, వడ్లకు బోనస్, ఎగ్గొట్టారని మండిపడ్డారు. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను ఆపి మరీ రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 


                               పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక అన్ని పథకాలను కోతలు పెట్టే పనిలో రేవంత్ ఉన్నారని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని.. కాంగ్రెస్‌ హామీలపై తాము పోరాటం చేస్తామని అన్నారు. రేవంత్ డిసెంబర్ 9వ తేదీన సీఎంగా ప్రమాణం చేసి రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పాడని.. కానీ రెండు రోజుల ముందే ప్రమాణ చేసి హామీని ఎగ్గొట్టారని విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బడే భాయ్ అని రేవంత్ అన్నాడని చెప్పారు. మోదీ బడే భాయ్, రేవంత్ చోటా భాయ్... ఇద్దరూ ఒకటేనని అన్నారు. తాను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని రేవంత్ చెప్పుకుంటున్నాడన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని... ముస్లిం మైనార్టీలు ఆలోచించాలని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే మోదీ ఆశీర్వాదాన్ని రేవంత్ ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోడని రేవంత్ చెప్పకనే చెప్పాడన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరెలా కాంగ్రెస్‌పై పోరాడుతామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.