DBN TELUGU:-
- ఆదిలాబాద్ రీజియన్ లోని మూడు (ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల) జిల్లాల్లో 8844 మందికి గాను 8422 మంది హాజరు.
- 95.23శాతం హాజరు నమోదు.
- మంచిర్యాల జిల్లాలో పరిక్షా కేంద్రాలను సందర్శించిన గురుకుల అసిస్టెంట్ సెక్రెటరీ జి.బి.వెంకటేశం.
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బిసి సంక్షేమ, ప్రభుత్య గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి అడ్మీషన్స్ కై ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ రీజియన్ లోని మూడు(ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల) జిల్లాల్లో 8844 మందికి గాను 8422 మంది హాజరవగా 422మంది గైర్హాజరయ్యారని ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో 2727 మందికి గాను 2628 మంది,కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2782 మందికి గాను 2637 మంది, మంచిర్యాల జిల్లాలో 3335 మందికి గాను 31547 మంది హాజరయ్యారు.
- బెల్లంపల్లి లో పరీక్షా కేంద్రాలను సందర్శించిన ప్రత్యేక పరిశీలకుడు గురుకుల అస్టెంట్ సెక్రెటరీ వెంకటేశం.
బెల్లంపల్లిలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎండలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను గిరిజన సంక్షేమ గురుకుల అసిస్టెంట్ సెక్రటరీ జిఎం వెంకటేశం సందర్శించి ఆయా చీఫ్ సూపరింటిండెంట్లను అభినందించారు. అదేవిధంగా బెల్లంపల్లి బాలుర సిఓఈ పరీక్షా కేంద్రాన్ని బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్ సందర్శించారు. 4 కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ పోలీస్ సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సి ఓ ఈ పరీక్షా కేంద్రానికి చీప్ సూపరింటిoడెంట్ గా ఐనాల సైదులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నస్పూరి నవ్యకుమారి, సిట్టింగ్ స్క్వాడ్ ఆడెపు సాగర్ వ్యవహరించారు.
- పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు:-
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం బెల్లంపల్లి (బాలురు) - 480 మందికి గాను 455 మంది హాజరు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం బెల్లంపల్లి (బాలికలు) - 480 మందికి గాను 456 మంది హాజరు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం కాసిపేట,బెల్లంపల్లి వద్ద (బాలురు) - 240 మందికి గాను 226 మంది హాజరు.
తెలంగాణ ప్రభుత్వ బాలుర గురుకులం, బెల్లంపల్లి - 288 కి గాను 270 మంది హాజరు.

