DBN TELUGU:-
- రేపటి గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.
- ఉదయం 11గం.లనుండి ఒంటి గంట వరకు పరీక్ష.
- పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ అమలు.
- ఎండలను దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ ఎయిడ్ కేంద్రం మరియు నీటి సౌకర్యం.
- గంట ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సిఓఈ ప్రిన్సిపాల్ సూచన.
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బిసి సంక్షేమ, ప్రభుత్వ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి అడ్మీషన్స్ కై ఈ నేడు(ఆదివారం) నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. పరీక్ష ఉదయం 11గం.లనుండి ఒంటి గంట వరకు ఉంటుదన్నారు. విద్యార్ధులకు ఓ.యం.అర్ లో బబ్లింగ్ చేసే విధానంపై ఇన్విజిలేటర్స్ అవగాహన కల్పించడానికి పరీక్ష హాల్ లోకి గంట ముందే అనుమతిస్తామన్నారు. ఆలస్యమైతే అనుమతి ఉండదనీ గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బెల్లంపల్లి లో 4 సెంటర్లు ఏర్పాటు చేశారు తాళ్ళ గురిజాల రోడ్ లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ, అదేరోడ్డులో లంబాడి తండ వద్దగల తెలంగాణ ప్రభుత్వ బాలుర గురుకుల కళాశాల, ఏఆర్ హెడ్ క్వార్టర్ రోడ్ లోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, అదేరోడ్ లో శివాలయం దగ్గర గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కాసిపేట (బెల్లంపల్లి వద్ద) లఓ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఆదిలాబాద్ రీజియన్ ( ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలు )లో 8844 మంది విద్యార్థులు పరీక్ష వ్రాస్తున్నట్లు ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు. వీరిలొ ఆదిలాబాద్ జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో 2727 మంది విద్యార్థులు,కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాల్లో 2782 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో 3335 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ మూడు జిల్లాలకు సంబందించి రూట్ ఆఫీసర్స్ గా యల్లా నంద రెడ్డి (ఆదిలాబాద్ జిల్లా) గద్దె రాజకుమార్ (ఆసిఫాబాద్ జిల్లా), కోటిచింతల మహేశ్వరరావు (మంచిర్యాల జిల్లా)లు ప్రశ్నాపత్రాలను శనివారమే ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటేండెంట్స్ సమక్షంలో దగ్గరలో గల పోలీస్ స్టేషన్స్ లో భద్రపరిచారు. ఆదిలాబాద్ రీజియన్ లోని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలకు సంబందించి ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో అయా అడిషనల్ కలెక్టర్లు కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి సౌకర్యాల విషయమై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
- సీట్లకు పెరిగిన పోటీ -
తెలంగాణ రాష్ట్రంలో ని నాలుగు రకాల గురుకులాలకు ఇదొక్కటే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కావడం వల్ల తల్లిదండ్రులకు వ్యయ ప్రయాస తగ్గింది. ఐతే పోటీ మాత్రo అధికంగా ఉండటంతో గురుకులాల్లో అడ్మీషనస్ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు కోచింగ్ సైతం ఇప్పిస్తున్నారు. దిలాబాద్ రీజియన్ లో 17సాంఘిక సంక్షేమ గురుకులాలు,19 మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకులాలు,7 గిరిజన సంక్షేమ గురుకులాలు, ఒక ప్రభుత్వ గురుకులం లాలు కలిపి అదిలాబాద్ రీజియన్ మూడు జిల్లాల్లో మొత్తం 44 గురుకులాలలో 3520 సీట్లు ఐదవ తరగతిలో అందుబాటులో ఉన్నాయి. వీటికి గాను 8,844 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.


