Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- 11న టిజి సెట్: ప్రిన్సిపాల్.

DBN TELUGU:- 


- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 న టిజి సెట్.


- పూర్తయిన ఏర్పాట్లు, ఉదయం 11గం.ల నుండి ఒంటి గంట వరకు పరీక్ష.  


- పరీక్షా హాల్ లో ఓయం ఆర్ బబ్లింగ్ పై అవగాహన కల్పించనున్న ఇన్విజిలేటర్స్.






- బెల్లంపల్లిలో 4 పరీక్షా కేంద్రలు.


- గంట ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సిఓఈ ప్రిన్సిపాల్ సూచన.        


తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ)లలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి అడ్మీషన్స్ కై ఈ నెల11న నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయినట్లు సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. శుక్రవారం పరీక్షకు సంబందించిన పలు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ రీజియన్ లోని మూడు (ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల) జిల్లాల్లో 8844 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హజరవుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు ఉంటుందన్న్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యర్ధుల హల్ టికెట్స్ సంస్థ వెబ్సైట్స్ లలో అందుబాటులో ఉన్నాయని విద్యార్ధులు 10వ తేదీ లోపు డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. విద్యార్ధులు హాల్టికెట్ తో గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా హాల్ లో ఇన్విజిలేటర్స్ సహాయంతో ఓయం ఆర్ షీట్ పై జవాబులు బబ్లింగ్ చేసే విధానంపై అవగాహన కల్పించనున్నట్ల ఆయన తెలిపారు.   

 

జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు 2727 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలు 2782 మంది, మంచిర్యాల జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు 3335 మంది


- ఆదిలాబాద్ రీజియన్ పరిదిలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు:-


-- ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాలు 17, గిరిజన సంక్షేమ గురుకులాలు 07, మహాత్మ జ్యోతిబా పూలే బిసి గురుకులాలు 19, ప్రభుత్వ గురుకులాలు 01 మొత్తం 44 గురుకులాల్లో 80 సీట్ల చొప్పున 3,520 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు హాల్ టికెట్ లో సూచించిన పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చునన్నారు. డిసిఓ వెంట బెల్లంపల్లి బాలుర సిఓఈ, బాలికలు, కాసిపేట బాలుర గురుకుల ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు, సందారాజ స్వరూప,  ఊటూరి సంతోష్, ప్రభుత్వ గురుకుల ప్రిన్సిపాల్ యస్.సత్తయ్య, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జిల్లాల డిసిఓ లు శ్రీనివాస్, పోలోజు బాలరాజు, సూపరింటిండెంట్ అవదూత రాజశేఖర్, పరీక్షల ఇంచార్జ్ వరమని ప్రమోద్ కుమార్ తదితరులున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.