Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: గురుకుల ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన గళం.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివిధ గురుకులాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం బెల్లంపల్లి బాలుర గురుకులంలో ఉద్యోగస్తులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.






భోజన విరామ సమయంలో కళాశాల గేటు వద్ద ఎండలో నుంచుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముక్తకంఠంతో తమ సమస్యలను ప్రభుత్వం సానుభూతితో ఆలోచించే దిశగా అడుగులు వేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రధానంగా కొన్ని డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు.


- ప్రమోషన్లు బదిలీలు తక్షణమే చేపట్టాలి.


- ఖాళీల భర్తీకి నూతన నియమకాలు చేపట్టాలి.


- పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలి.



- గురుకుల ఉపాధ్యాయులకు ఫ్యారిటి స్కేల్ ను వర్తింపచేయాలి.


- జీవో నెంబర్ 317 కు తక్షణమే పరిష్కారం చూపించాలి.


- అన్ని గురుకుల సంస్థలను ఒకే యాజమాన్యం కిందికి తెచ్చి ప్రభుత్వం జీవోను తప్పకుండా అమలు చేయాలి.


- డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా నియమకం పొందిన వారికి పే మరియు సర్వీస్ ప్రొటెక్షన్ అమలు చేయాలి.


- 2007 లో రెగ్యులర్ అయిన ఉద్యోగస్తులు అందరికీ సంస్థలు జాయిన్ అయిన రోజు నుండి సర్వీస్ ను లెక్క కట్టి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఓ పి ఎస్ పరిధిలోకి కు రావాలి.


- హాలిడే డ్యూటీస్ కు ప్రత్యామ్నయంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలి.


- అన్ని డిగ్రీ కళాశాలలో ఏవో పోస్ట్ నియమించాలి.


- అన్ని గురుకుల కళాశాలకు డిప్యూటీ వార్డెన్ పోస్ట్ మంజూరు చేయాలి.


- అన్ని గ్రూపులలో సంస్థలకు ఒకే కాల నిర్ణయ పట్టిక మరియు ఒకే స్టాప్ ప్యాట్రన్ ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.  


- బీసీ మరియు జనరల్ సొసైటీలో కాలనిర్ణయ పట్టికను విద్య హక్కు చట్టప్రకారం మార్చాలి.


- అకారణమైన సస్పెన్షన్లు ఎత్తివేయాలి.

మొదలగు డిమాండ్లతో ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.