Type Here to Get Search Results !

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.

DBN TELUGU:- 


- జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.



- జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే కట్టుబడి ఉంది.



- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్.





ఆసిఫాబాద్ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టియుడబ్ల్యూజే -ఐజేయూ) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ లో టియుడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు సామాజిక సేవ దృక్పథం పనిచేస్తు అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండి పోరాడితేనే హక్కులు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదని వెంటనే జర్నలిస్టులకు వైద్యం అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు రైల్వే పాసుల రాయితీ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కొరకు టీయూడబ్ల్యూజే కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రాలలో జర్నలిస్టు భవన్ కోసం స్థలం కేటాయించి జర్నలిస్టు భవన్ నిర్మాణం కొరకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యుడు ఎస్ వేణుగోపాల్ , జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఆడప సతీష్ , జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు , సురేష్ , నవీన్ గౌడ్ , చంద్రకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్ష , బిక్కాజి , రమేష్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ హన్నన్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవునూరి రమేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు రాధేశం, వారణాసి శ్రీనివాస్ , జాడే రాందాస్ , యూనియన్ జిల్లా సభ్యులు తారు, నితేష్, మిలిన్ కుమార్, నౌషాద్, రఫిక్, శివ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.