ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ డిప్యూటీసీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ‘కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. మంత్రి వర్గంలోని సీనియర్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి లేదా సంకీర్ణంలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి డిప్యూటీ సీఎంలను అపాయింట్ చేస్తున్నారు. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రి వర్గంలో ఒక మంత్రే. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగంలోని ఏ నిబంధనను ఉల్లంఘించడం లేదు’అని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం.
ఫ్లాష్ న్యూస్:- డిప్యూటీ సీఎం పదవులపై.. సుప్రీంకోర్టులో కీలక తీర్పు.
February 12, 2024
0
Tags