DBN TELUGU:- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దయ్యాయి. ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది.