DBN TELUGU:-
- జాతీయస్థాయి క్రీడాపోటీలకు బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధి.
- అభినందించిన సంక్షేమ గురుకులాల స్పోర్ట్స్ ఆఫీసర్ రాంలక్ష్మణ్, ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జూనియర్ మీట్ కు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ), బెల్లంపల్లి విద్యార్ధి జంగంపల్లి ప్రణయ్ చరణ్ (10వ తరగతి) సోమవారం తెలంగాణ రాష్ట్ర జట్టుతో కలిసి వెళ్ళినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. పాట్నా (బీహార్) లో ఈనెల 21నుండి 23వరకు జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొననున్న తెలంగాణ జట్టులో ప్రణయ్ ఆడనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ప్రణయ్ ను తల్లిదండ్రులు వెంకటమ్మ రాజేందర్ల సమక్షంలో పుష్పగుచ్చాలతో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు అభినందించారు. అదేవిధంగా సంక్షేమ గురుకులాల స్పోర్ట్స్ ఆఫీసర్ రాం లక్ష్మణ్, ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ముగ్గురు జాతీయ స్థాయిలోను, 49 మంది విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలోను క్రీడల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. బెల్లంపల్లి సిఓఈ చదువుతోపాటుగా క్రీడల్లోను విద్యార్ధులను ప్రోత్సహిస్తూ ఇతర గురుకులాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు వామన్, రాకేష్, ప్రిన్సిపాల్ సైదులును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అల్లురి వామన్, నడిగొట్టి రాకేష్ కుమార్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట పోచన్న, బి.కిరణ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.వేణుగోపాల్, జెవిపి పొన్నం శ్రీనివాస్,ఉపాధ్యాయులు షిండే దత్తప్రసాద్, కొక్కుల రాజేశ్వర్, కోట్రంగి గణపతి, శ్యాంసుందర్ రాజు, వరమని పరమోద్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
