DBN TELUGU:- టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి బస్ స్టాండ్ ఆవరణలో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం స్పెషల్ బస్సులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి మేడారం జాతరకు బెల్లంపల్లి బస్టాండ్ నుండి తొలి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మేడారం జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి బస్టాండ్ నుండి భక్తుల సౌకర్యార్థం 85 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

