Type Here to Get Search Results !

రామ జన్మభూమిలో 'బాయిజమ్మ' సాయిభోజన్.

DBN TELUGU:- 


- రామ జన్మభూమిలో 'బాయిజమ్మ' సాయిభోజన్.


- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్వహణ.


- బెల్లంపల్లి నుంచి అయోధ్యకు తరలివెళ్లిన ట్రస్టు సభ్యులు, సేవకులు.







-- రథసప్తమి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకుల సహకారంతో రామజన్మభూమి అయిన అయోధ్యలో అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా అన్నార్థులు అయోధ్య రామ మందిర సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యుగపురుషుడు శ్రీరాముడు జన్మనిచ్చిన నేలపై అన్నదానం చేయడం ఆనందకరంగా ఉందని వాయుజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. అంతటి పవిత్ర స్థలంలో ఇంతటి పుణ్య కార్యక్రమం చేపట్టడం సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనార్తుల కడుపు నింపే ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు ఇతర చాలా చోట్లకు విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దుర్గం మారుతి, సేవకులు మీడియా సిబ్బంది, సేవకులు రౌతు సాయికుమార్ లగ్గామ దామోదర్ కొండగుర్ల అశోక్, బండయ్య, కామెర రాజేశ్వర్ గౌరీ సత్తయ్య, జాడి వెంకటి, కొండయ్య దాతలు, తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.