DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగదారి గూడకు చెందిన ఒక వ్యక్తి తాండూర్ కు గంజాయి తీసుకువస్తున్నాడానే నమ్మదగిన సమాచారం మేరకు లింగదారి గూడా నుండి తాండూర్ వెళ్లే మార్గంలో అనుమానస్పదంగా ఒక వ్యక్తి కనిపించగా అతనిని తనిఖీ చేయగా 100 గ్రాములు డ్రై గంజాయి లభించింది.
అనంతరం అతడిని పోలీసులు విచారించగా అతని పేరు జాడి రుక్మాజీ అని తెలిపి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో ఇంట్లో గంజాయి చెట్టు పెంచి తాండూర్ ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది. నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం తాండూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
