DBN TELUGU:- నిర్మల్ జిల్లా కేంద్రంలో గల భగత్ సింగ్ భవన్లో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం లో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న మాట్లాడుతూ... నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలని, రంగ సంస్థల ప్రైవేటీకరణను, అమ్మకాన్ని నిపివేయాలని మరియు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16 న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రి సమ్మెలో పాల్గొనాలని కేంద్రప్రభుత్వ విధానాలతో కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతో పాటు మధ్య తరగతి ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు. ఏళ్ళ తరబడి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో కొనసాగిస్తున్నారు. గత పదేళ్ళలో ఆదాయపన్ను స్లాబులను సవరించలేదు, రాయితీ మొత్తాన్ని పెంచలేదు. అన్ని వస్తువులపై జిఎస్టీ వసూలు చేస్తూ వేతన జీవులపై ఆదాయపన్ను భారాన్ని అధికంగా మోపి, కార్పొరేట్లకు మాత్రం పన్నుల్లో రాయితీలు కల్పించారు. రైతులు, కార్మికుల సమస్యలతో పాటు ఆదాయపన్ను శ్లాబులు సవరించాలని, రాయితీ పరిమితిని పెంచాలని లను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, -2020 ని ఉపసంహస్తూ….. సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బందు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కిషన్, జిల్లా కార్యదర్శి సాయన్న, లక్ష్మణ్ ,ఆనంద్ ,వర్మ ,రమేష్ ,ప్రభాకర్ ,తదితరులు పాల్గొన్నారు.

